Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా విచారణ సీబీఐకి సర్కారు లేఖ

ఎన్డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా విచారణ సీబీఐకి సర్కారు లేఖ

- Advertisement -

ఉత్తరం అందింది : సీబీఐ హైదరాబాద్‌ శాఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

కాళేశ్వరంపై నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు తెలంగాణ ప్రభుత్వం సిఫారసు చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు ఉన్నట్టు గుర్తించిందనీ, ప్రణాళిక, డిజైన్‌, నాణ్యత, నిర్మాణంలో లోపాలు ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. అందుకే ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరింది. జస్టీస్‌ పీసీ ఘోష్‌ కమిటీ కూడా విచారణ జరిపి లోపాలను గుర్తించిందని తెలిపింది. ఎన్డీఎస్‌ఏ నివేదిక అసెంబ్లీలో చర్చించామనీ లేఖలో ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు రాష్ట్రానికి సీబీఐ రాకుండా గతంలో ఉన్న ఆదేశాలను సడలిస్తూ జీవో నెంబరు 104ను విడుదల చేస్తూ హోంశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రెటరీ రవిగుప్తా ఆదేశాలు ఇచ్చారు. పాత జీవో 51లో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. సీబీఐ విచారణకు అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ తమకు అందిందంటూ సీబీఐ హైదరాబాద్‌ శాఖ సీఐ రశీదు సర్కారుకు ఇచ్చారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad