Monday, April 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలి

- Advertisement -

పెండింగ్లో ఉన్న 5 డీఏలను వెంటనే ప్రకటించాలి
టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యులు  కొర్ర శంకర్
నవతెలంగాణ – అచ్చంపేట
ప్రభుత్వ పాఠశాల కాపాడుకోవాలని, పెండింగ్లో ఉన్న ఐదు బియ్యాలను వెంటనే ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర  ఆడిట్ కమిటీ సభ్యులు కొర్ర శంకర్ అన్నారు. సోమవారం అచ్చంపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో టీఎస్ యుటిఎఫ్ 13 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పథకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1974 ఆగస్టు 10వ తేదీన ప్రాంతాలు, క్యాడర్లు ,మేనేజ్మెంట్లు, కులాలు, మతాల వారిగా ఉన్న సంఘాల అంతరాలను అధిగమించి రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులందరినీ సమైక్యపరిచి రాష్ట్రవ్యాప్తంగా ఒకే సంఘం ఉండాలనే దృఢ సంకల్పంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో  ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ స్థాపన జరిగిందన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో 40 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాలుగా పాఠశాల విద్యారంగ పరిరక్షణ కొరకు, ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం కొరకు స్వతంత్రంగాను, ఐక్యంగాను రాజిలేని సమరశీల పోరాటాలు చేస్తున్న  ఏకైక సంఘం టీఎస్ యుటిఎఫ్ సంఘం అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం  టీఎస్ యుటిఎఫ్  గా ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పిఆర్సి సాధన, 2024లో పదోన్నతులు సాధించుకోవడం జరిగిందన్నారు.

 అదేవిధంగా ఈ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా  పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను క్లియర్ చేయాలని, పిఆర్సి రిపోర్టును తెప్పించుకొని బహిర్గతపరిచి 50 శాతంతో ఫిట్మెంట్ జూలై 1, 2023 నుండి అమలు చేయాలన్నారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉపాధ్యాయుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులన్నింటినీ క్లియర్ చేయాలన్నారు.

విద్యా కమిషన్ రిపోర్టులోని కొన్ని సిఫారసులు పాఠశాల పరిరక్షణకు మరియు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా నూతన జాతీయ విద్యా విధానం 2020కి అనుకూలంగానూ ఉన్నందున ఉపాధ్యాయ సంఘాలతో చర్చించిన తర్వాతనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ సభ్యులు రాములు, బాబూరావు , వివిధ మండలాల నాయకులు  విష్ణు వర్ధన్ , హనుమ, సైదులు, నరసింహ, సూర్య, మోతీరాం, బిక్కు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -