Thursday, March 26, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ప్రభుత్వ బడులే విద్యకు పునాది కావాలి: డీఈవో యాదయ్య

ప్రభుత్వ బడులే విద్యకు పునాది కావాలి: డీఈవో యాదయ్య

- Advertisement -

నవతెలంగాణ జన్నారం

ప్రభుత్వ పాఠశాలలే చిన్నారుల భవిష్యత్తుకు పునాది కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అన్నారు. జన్నారం మండలం అక్కపల్లిగూడ ప్రభుత్వ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఒకే పాఠశాల నుంచి 22 మంది విద్యార్థులు గురుకులాలకు ఎంపికై రాష్ట్రస్థాయిలో రికార్డు సృష్టించడం అభినందనీయమన్నారు. ఎంపీపీఎస్ అక్క పెళ్లిగూడ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన ప్రాథమిక విద్యను అందించటంలో ముందున్నారని, గురుకులంలో 22 మంది విద్యార్థులు సీట్లు సాధించడం చాలా గొప్ప విషయం అని, ఈ సందర్భంగా సీట్లు పొందిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను జిల్లా విద్యాధికారి ఎస్.యాదయ్య సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయలు జాజాల శ్రీనివాస్ ఉపాధ్యాయులను ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చేసిన వందేమాతరం ఫౌండేషన్ సీఈఓ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్ది సమాజానికి విలువలు పెంచే విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఈ పాఠశాల ముందుందని, ప్రభుత్వ బడులను బ్రతికించాలని విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామ ప్రజలను కోరారు.

ఈ కార్యక్రమంలో పొన్కల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్ , జన్నారం సర్పంచ్ అజ్మీరా కళావతి నందు నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎం భరత్ SO 1, ఏ సత్యనారాయణమూర్తి SO 2, చౌదరి SO 3, విజయలక్ష్మి SO 4, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముజఫర్ అలీ, సభాధ్యక్షులు మండల విద్యాధికారి ఎన్ విజయ్ కుమార్, పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -