- Advertisement -
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ప్రజాహిత బ్రహ్మ కుమారి ఈశ్వరియా విశ్వవిద్యాలయ రాజా యోగ శిక్షణ కేంద్ర సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన చెల్లెలు లీల స్వయంగా రాఖీ కట్టారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, అక్క-తమ్ముడు, అన్న-చెల్లెళ్ళ మధ్య అపారమైన ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండుగ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించే పర్వదినమని పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి మహిళా జీవితంలో ఆనందం నింపాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -