Sunday, November 9, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

- Advertisement -

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పణ


నవతెలంగాణ- అలంపూర్‌
ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అయిదవ శక్తిపీఠం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో సోమ వారం ఘనంగా జోగులాంబ బాల బ్రహ్మేశ్వరుల కళ్యాణం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజ రామయ్యర్‌, ఎమ్మెల్యే విజరుతో కలిసి మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. వీరికి ఆలయ అర్చకులు, ఆలయ చైర్మెన్‌ నాగేశ్వర్‌ రెడ్డి, కార్యనిర్వహణాధికారి దీప్తి సాదర స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రముఖ ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నట్టు తెలిపారు. కాగా, దసరా శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం జోగులాంబ దేవి మహాగౌరీ దేవి అలంకారంలో యాత్రికులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, గద్వాల సంస్థాన వారసులు కృష్ణా రాంభూపాల్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -