Friday, February 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

పేదల సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మిడ్జిల్ 
గ్రామంలో నిరుపేదలు సొంత ఇంటి కల నెరవేర్చడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండలంలోని కొత్తూరు గ్రామంలో ఇందిరమ్మ ఇల్లును మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అందించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ  ఇండ్లు రెండో విడతలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ లబ్ధిదారులు ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ బిల్లులు త్వరగా వచ్చే విధంగా అధికారులకు చేయాలని చెప్పారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ మహేష్, మిడ్జిల్ మాజీ ఎంపీటీసీ సభ్యులు మహమద్ గౌస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -