Thursday, August 28, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

జీపీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి

- Advertisement -

గరుకు ఐలయ్య గ్రామపంచాయతీ వర్కర్స్ మండల కమిటీ నాయకులు..
నవతెలంగాణ – గోవిందరావుపేట
: సమ్మె నోటీసు ఇచ్చిన గ్రామపంచాయతీ కార్మికులు గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం  చెందిందని గ్రామపంచాయతీ వర్కర్స్ మండల కమిటీ నాయకుడు గరుగు ఐలయ్య అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ  గ్రామపంచాయతీ కార్మికులు గోవిందరావుపేట ఎంపీడీవో జోహార్ రెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల కార్యదర్శి గరుగు  ఐలయ్య మాట్లాడుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు సిఐటియు ఆధ్వర్యంలో ఈనెల 20న కార్మిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె నోటిస్  ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు.మండలంలోని అన్ని  గ్రామపంచాయతీ కార్మికులు ఈ సమ్మె కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన కోరారు.గత అనేక సంవత్సరాలుగా  గ్రామపంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో జీవితాలు గడుపుతున్నారని ఆయన అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం నెలకు 26000 ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని గ్రామపంచాయతీ కార్మికులకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికులు ఉప్పలయ్య కుమారస్వామి,రాజు,విజయ,కుమార్,సంపత్ ,వెంకన్న, సీతయ్య, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad