Monday, November 24, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీపీవోలు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి

జీపీవోలు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేర్చాలి

- Advertisement -

తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మైన్‌ వి.లచ్చిరెడ్డి
జీపీవోఓఏటీజీ రాష్ట్ర అధ్యక్షులుగా గరికె ఉపేంద్రరావు, మహిళా విభాగం అధ్యక్షులుగా కంది శిరీష

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
గ్రామ పాలన అధికారులు ప్రజా ప్రభుత్వం ఆశయాన్ని నెరవేర్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మెన్‌ వి. లచ్చిరెడ్డి సూచించారు. గ్రామీణ రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేస్తేనే క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర సర్కారు భావిస్తోందన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గ్రామ పాలన ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ (జీపీవోఓఏటీజీ) ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. రెవెన్యూ వ్యవస్థ నిర్వీర్యమవుతున్న పరిస్థితి నుంచి ప్రభుత్వ సహకారంతో రెవెన్యూ వ్యవస్థను గ్రామగ్రామాన పునర్నిర్మాణమవుతున్నదని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను కాపాడుకునేందుకు అందరూ సంఘటితం కావాలనీ, ఐక్యంగా ఉంటేనే సమస్యల పరిష్కారం సాధ్యం అవుతుందని చెప్పారు.

జీపీవోలు అంకిత భావంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ప్రతి గ్రామాన్ని రెవెన్యూ, భూ సమస్యలు లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. జీపీవోలలో ఏ ఒక్కరు తప్పు చేసినా మొత్తం వ్యవస్థకు చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. రెవెన్యూ వ్యవస్థను చిన్నాభిన్నం చేసిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పదోన్నతుల విషయంలో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో జీపీఓఏటీజీ సలహాదారులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ కో-చైర్మెన్‌, డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్‌.రాములు, పాక రమేష్‌, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్ర కార్యదర్శి వి.బిక్షం, టీజీఆర్‌ఎస్‌ఏ రాష్ట్రం కోశాధికారి మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

జీపీఓఏటీజీ రాష్ట్ర నూతన కార్యవర్గం ఇదే..
గ్రామపాలన అఫీసర్స్‌ అసోసియేషన్‌ తెలంగాణ(జీపీవోఓఏటీజీ) రాష్ట్ర అధ్యక్షులుగా గరికె ఉపేంద్రరావు, మహిళా విభాగం అధ్యక్షులుగా కంది శిరీషారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా అర్జున్‌ మల్లారం, ఆర్‌.విజరుకుమార్‌, కోశాధికారిగా ఇంజమూరి ఈశ్వర్‌, సెక్రటరీ జనరల్‌గా వి.లక్ష్మీనర్సింహులు, దాసరి వీరన్న, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఏవీ జ్యోతిరెడ్డి, కారుమూరి చంద్రయ్య, ముధుం చిరంజీవి, ఉపాధ్యక్షులుగా బచ్చలకూర పరమేశ్‌, ఎం.చంద్రశేఖర్‌గౌడ్‌, ఎల్‌. నర్సింహారావు, లక్ష్మీనారాయణ, ఆర్‌.నాగలక్ష్మి, కార్యదర్శులుగా కోనబోయిన ప్రసాద్‌, బి.శ్రీనివాస్‌, బండి శ్రీనివాస్‌, సునీత, నీరుడు మల్లీశ్వరి, కోటేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ కార్యదర్శులుగా ముత్యాలు, చర్ల శ్రీనివాస్‌, పృథ్వీ, పి.వరలక్ష్మి, అశోక్‌, కావలి వెంకటయ్య, సంయుక్త కార్యదర్శులుగా ఆత్రం అనసూర్య, మర్రి శంకర్‌స్వామి, సామా ప్రియాంకరెడ్డి, కమలాకర్‌, సువార్త, కె.బాబూదేవ్‌, బి.నాగేశ్వరరావు, సాంస్కృతిక కార్యదర్శులుగా క్రిష్టయ్య, రాజరత్నం, స్పోర్ట్స్‌ కార్యదర్శులుగా రత్నాకర్‌, మాన్‌సింగ్‌, సత్యం, గంగాధర్‌లతో పాటు 13 మంది రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -