Monday, October 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్
ఆలూర్ మండలం డీకంపల్లి గ్రామ శివారులో గల రామస్వామి క్యాంపులో ఐకెపి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ రమేష్, ఎంపీడీవో గంగాధర్ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా తహసీల్దార్ రమేష్, ఎంపీడీఓ గంగాధర్ మాట్లాడుతూ రైతుల కష్టానికి తగిన న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్యాడి కొనుగోలు కేంద్రం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. అలాగే రైతులు తేమ శాతం, బస్తాల కొరత, తూకాల సమస్యలపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఐకెపి సిబ్బంది పర్యవేక్షణలో పారదర్శకంగా కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో తమ ధాన్యం విక్రయించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి దినేష్, మండల సమైక్య ఏపీఎం ఉమా కిరణ్, సీసీ రాజారమేష్, సి ఏ అనిత, సమాఖ్య అధ్యక్షులు మాధురి, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -