Saturday, February 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేనూర్ జీపీలో అశోక్ పటేల్ అధ్యక్షతన గ్రామసభ

మేనూర్ జీపీలో అశోక్ పటేల్ అధ్యక్షతన గ్రామసభ

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామపంచాయతీలో శనివారం ఆ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. ఈ గ్రామసభలో వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి ఎద్దడి రాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని తీర్మానించారు. అదేవిధంగా పంచాయతీ పరిధి నుండి మొరం తవ్వకాలు ఇతర గ్రామాలకు భారీగా తరలి వెళ్తున్న దానిని పూర్తిగా నిలిపివేయాలని మేనూరు జిపి మొరం మేనూరుకు మాత్రమే పరిమితం కావాలని గ్రామస్తులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ గ్రామసభ లో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఎస్ఐ మోహన్ రెడ్డి పాల్గొని గ్రామంలో సిసి కెమెరాల ఏర్పాటుపై గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలతో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో సమగ్రంగా వివరించారు. ఎస్సై సీసీ కెమెరాల గురించి అవగాహన కల్పించడం గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు గ్రామ సభలో చర్చించుకున్నారు. గ్రామంలో పరిశుభ్రత త్రాగునీటి సమస్య వీధిలైట్ల సమస్య ముఖ్యమైన వాటి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సబ్డే మలకయ్య, గ్రామ కార్యదర్శి హరీష్ కుమార్, ఏఈఓ విశాల్ గౌడ్, జిపిఓ సంగమని, అంగన్వాడీ టీచర్లు, కరెంటు సిబ్బంది, ఉపాధి హామీ ఐకెపి సిబ్బంది, తదితరులతో పాటు పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -