- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
చిన్న షక్కర్గాలో శనివారం సర్పంచ్ దిగంబర్ అధ్యక్షతన గ్రామసభ జరిగింది. గ్రామంలోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సర్పంచ్, కార్యదర్శి ప్రణయ్ సహకారం మరువలేనిదని వార్డు సభ్యులు, గ్రామస్థులు అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని గ్రామంలో నిటి ఎద్దడి లేకుండా చూడాలని ప్రజలు కోరారు. గ్రామాభివృద్దికి సర్పంచ్, కార్యదర్శి కృషి ఎప్పటికీ ఇలాగే ఉండాలని తెలిపారు. వారి సహకారంతో గ్రామం మరింత అభివృద్ది పథంలో నడుస్తుందని అన్నారు. ఈ సభలో పాల్గొన్న గ్రామస్తులు ప్రత్యేకంగా సర్పంచ్, కార్యదర్శిలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.
- Advertisement -



