నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలంలోని 18 గ్రామ పంచాయతీల పరిధిలో గురువారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఇంచార్జి ఎంపీడీవో మమత తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మమత మీడియాతో మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఏప్రిల్ 2, గురువారం రోజున ప్రత్యేక అధికారి సమక్షంలో గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు “ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక–99 రోజుల కార్యాచరణ ప్రణాళిక” అమలులో భాగంగా ఈ సభలు జరుగుతాయి. గ్రామాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల పురోగతి తదితర అంశాలపై చర్చించనున్నట్లు పేర్కొన్నారు. గ్రామస్తులకు కావలసిన అంశాలపై సభలో అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్నారు. వీలైనంతవరకు అన్ని శాఖ ల అధికారులు గ్రామ సభలలో ఉంటారని ఆయా శాఖలకు సంబంధించిన అంశాలను ప్రజలు వారి సమస్యలను అడిగి నివృత్తి చేసుకోవచ్చన్నారు



