Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామసభలు సజావుగా నిర్వహించాలి.!

గ్రామసభలు సజావుగా నిర్వహించాలి.!

- Advertisement -

నవతెలంగాణ -పెద్దవూర
ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామ, వార్డు సభలను పెద్ద ఎత్తున నిర్వహించు కోవాలని ప్రజాపాలన ప్రత్యేక అధికారి రాజ్ కుమార్ అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని ప్రజాపరిశత్ కార్యాలయంలో అధికారులకు నిర్వహించిన సమావేశం లో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు చదివి వినిపించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ, మండలం లోని అన్ని గ్రామాల్లో ప్రజాప్రతినిధులను, ప్రజలను భాగస్వామ్యం చేసి సజావుగా నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలతో పాటుగా కొత్తగా అమలు చేయనున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం, ఇంటర్ వరకు మధ్యాహ్న భోజన పథకం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం పథకం వంటి వాటి గురించి గ్రామ సభల్లో ప్రస్తావించాలన్నారు.

ఈ కార్యక్రమం లో మండల అభివృద్ధి అధికారి ఉమాదేవి,తహసీల్దార్ శ్రీదేవి, మండల విద్యాధికారి తరిరాము,మండల.ప్రజా పరిషత్ సీనియర్ అసిస్టెంట్ పంకజ్ రెడ్డి,ఆర్ డబుల్యూ ఎస్ ఏఈ దీక్షిత్ కుమార్,ఏసీడీపీఓ సువర్ణ,హాస్టల్ వార్డెన్ బాలకృష్ణ,ఏపీఓ రామ చంద్రయ్య,అంగన్వాడీ సూపర్ వైజర్లు వైజర్ వెంకాయమ్మ,శశికళ,సిహెచ్ ఓ శ్రీనివాస్, కార్యదర్శులు,ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -