Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలుజిల్లాలో మొదలైన గ్రామసభలు

జిల్లాలో మొదలైన గ్రామసభలు

- Advertisement -

– నీటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు

– పలు అంశాలపై తీర్మానాలు

నవతెలంగాణ – కామారెడ్డి

డిసెంబర్ నెలలో 11, 14, 17 మూడు విడతలలో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు 22 న జిల్లాలోని గ్రామపంచాయతీలలో ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామపంచాయతీ లో మొదటి గ్రామ సభను సర్పంచ్ యాదగిరి గౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో కార్యదర్శి సంగీత గత సర్పంచ్, అనంతరం రెండు సంవత్సరాల ప్రత్యేక అధికారుల పాలనలో జరిగిన ఆదాయవ్యయాలను చదివి వినిపించారు.

ఈ సమావేశంలో నేటి సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడే కంటే అది రాకముందే జాగ్రత్త పడేందుకు పళ్ళు నిర్ణయాలను తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, పాఠశాలల సమస్యలు, రైతులకు వ్యవసాయ అధికారి సూచన సలహాలు అందించారు. ఈ సమావేశంలో ఏఈఓ రాణి రైతులకు పంటలపై అవగాహన కలిగించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గూడెం శ్రీనివాస్ రెడ్డి, ఉపసర్పంచ్ కొండి అశోక్, వార్డ్ మెంబర్లు ఆకుల చిన్న గంగాగౌడ్, చిందాల సుజాత, దాకాల ప్రియాంక, తెడ్డు బాలరాజ్, దంతేపల్లి రాధా, వడ్డే లక్ష్మి, పంగా శ్రీనివాస్, కారోబార్ చాకలి లింగం, అధికారులు ఐకెపిసిసి, జూనియర్ లైన్మెన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మొదటి గ్రామ సభకే గ్రామ పాలనాధికారి డుమ్మా..

కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి గ్రామసభను కామారెడ్డి మండలంలోని గూడెం గ్రామంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన ప్రధాన శాఖలో పనిచేస్తున్న గ్రామ పాలన అధికారి మొదటి సమావేశానికి రాకపోవడంతో, ప్రజలు తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వీలు లేకుండా పోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -