- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
కాంగ్రెస్ పార్టీ, తపస్ జిల్లా శాఖ పక్షాన వ్యాస పౌర్ణమి సందర్భంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తిప్పాపూర్ గ్రామంలో గురుపూజోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, తపస్ జిల్లా అధ్యక్షులు రాఘవరెడ్డి పాఠశాలలోని ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత ఉపాద్యాయ సంఘం పక్షాన వ్యాస మహర్షి జన్మదినాన్ని పురస్కరించుకొని పాఠశాలలో గురుపూజోత్సవం నిర్వహించి గురువుల గొప్పతనం వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్ రెడ్డి, గ్రామాభివృద్ధికమిటి సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -