Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఘనంగా పదవీ విరమణ మహోత్సవం

ఘనంగా పదవీ విరమణ మహోత్సవం

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పేట్ ఉన్నత పాఠశాలలో సోషల్ స్కూల్ అసిస్టెంట్ మందాపురం లింబాగౌడ్ పదవీ విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమాన్ని  గురువారం ఉన్నత పాఠశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉపాధ్యాయులు జింధం నరహరి రూపొందించిన అక్షరాభిషేకం-జీవన తరంగాలు అనే కరపత్రాన్ని ఆవిష్కరింపజేసి,వారు మాట్లాడుతూ 38 వసంతాల ఉపాధ్యాయ వృత్తి ప్రస్థానంలో ఎందరెందరో విద్యార్థులను జాతి గర్వించే ఉత్తమ పౌరులను తీర్చిదిద్దిన లింబాగౌడ్ విధి నిర్వహణను మించిన దేశసేవ లేదని తపించి సమయపాలన, అంకితభావంతో విధులు నిర్వహించి ఉపాధ్యాయ లోకానికి ఆదర్శంగా నిలిచారన్నారు.పీఆర్టీయు సంఘంలో అనేక పదవులు అనుభవించి,అధ్యక్షులుగా ఎనలేని  సేవలందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు ఇందిర, మాజీ సర్పంచ్ బండమీది జమున గంగాధర్ , మాజీ ఎంపీటీసీ యల్ల రాజ్ కుమార్ , పి ఏ సి ఎస్ చైర్మన్ బంటు మహిపాల్, పి ఆర్ టి యు రాష్ట్ర అస్సియేషన్ అధ్యక్షుడు లక్ష్మణ్ పటేల్ , రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి ,సంతోష్ , పి ఆర్ టి య మండల అధ్యక్ష,  ప్రధాన కార్యదర్శులు ఇట్టెం గోపాల్ ,  అశోక్  పాఠశాల ఉపాధ్యాయులు మయి జ్ఞానపుష్ప, రాజేష్ కుమార్, రాజ్ కుమార్, సుజాత, సునిత, స్వరూపారాణి, మహేశ్వర్,శ్రీనివాస్,ప్రాథమిక పాఠశా ల హెచ్ఎం అనసూయ,ఉపాధ్యాయులు, విద్యార్థినీ, విధ్ద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad