బిల్లును ప్రవేశపెట్టిన కాంగ్రెస్ సభ్యుడు ర్యాండీ ఫైన్
వాషింగ్టన్ : గ్రీన్‌ల్యాండ్ స్వాధీనంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో కాంగ్రెస్ సభ్యుడు ర్యాండీ ఫైన్ కీలక బిల్లును ప్రవేశపెట్టారు. గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని
దానిని అమెరికాలో చివరి రాష్ట్రంగా చేర్చుకోవాలన్న బిల్లును ప్రతిపాదించారు. ఈ మేరకు గ్రీన్ ల్యాండ్ స్వాధీనం, రాష్ట్ర హౌదా చట్టాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. గ్రీన్‌ల్యాండ్‌ను అమెరికాలోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని మార్గాలను అనుసరించడానికి అమెరికా అధ్యక్షుడికి అధికారం ఇచ్చే చట్టంగా తెలిపారు. ఆర్కిటిక్‌లో రష్యా, చైనాల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా జాతీయ భద్రత కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు చెప్పుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ వాదనతో ఏకీభవించినట్టు తెలిపారు
గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఆర్కిటిక్ ప్రాంతాన్ని నియంత్రించకుండా మన శత్రువులను నిరోధించవచ్చు. ఇంకా రష్యా, చైనా నుంచి మన ఉత్తర ప్రాంతాన్ని రక్షించుకోవచ్చు” అని ర్యాండీ ఫైన్ చెప్పారు.
సంవత్సరాలుగా అనుసరిస్తున్న బలహీనమైన విధానాలు ఆర్కిటిక్‌లో అమెరికా వ్యూహాత్మక స్థానాన్ని క్షీణింపజేశాయని అభిప్రాయపడ్డారు. ”గ్రీన్‌ల్యాండ్ మనం విస్మరించగల సుదూర ప్రాంతం కాదు. ఇది చాలా ముఖ్యమైన జాతీయ భద్రతా ఆస్తి. గ్రీన్‌ల్యాండ్‌ను ఎవరు నియంత్రిస్తారో వారు అతి కీలకమైన ఆర్కిటిక్ షిప్పింగ్, అమెరికాను రక్షించే భద్రతా నిర్మాణాన్ని నియంత్రిస్తారు. భవిష్యత్తును, మన భద్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వాటిని అమెరికా ఇలా వదిలివేయకూడదు” అని కాంగ్రెస్ సభ్యుడు ర్యాండీ ఫైన్ అన్నారు.
నాటోను కాపాడా..ట్రంప్
నేను నాటోను కాపాడిన వ్యక్తిని వారిని జీడీపీలో 5.5 శాతం చెల్లించేలా వారిని నేను ఒప్పించాను. అని ట్రంప్ చెప్పారు. అది 2 శాతంగా ఉన్నప్పుడు వారు చెల్లించలేదు, ఇప్పుడు వారు 5 శాతం చెల్లిస్తున్నారు. నేను నాటోను రక్షించాను. నేను అధ్యక్షుడిగా కాకపోయి ఉంటే నాటో ఉండేది కాదు. నేను అలా చేస్తే.. నాటోకు కోపం రావచ్చు. నాకు నాటో అంటే ఇష్టం. మాకు నాటో అవసరమైనప్పుడు, వారు మాకు అండగా ఉంటారా లేదా అని నేను ఆలోచిస్తున్నాను వారు ఉంటారని నాకు నమ్మకం లేదు. మేం నాటోపై చాలా డబ్బు ఖర్చు చేశాం.” అని ట్రంప్ అన్నారు.
అమెరికా రాష్ట్రంగా గ్రీన్‌ల్యాండ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



