Thursday, December 25, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంపాలస్తీనా అనుకూల ప్రదర్శనలో..గ్రేటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌.. విడుదల

పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో..గ్రేటా థన్‌బర్గ్‌ అరెస్ట్‌.. విడుదల

- Advertisement -

లండన్‌ : లండన్‌లో మంగళవారం జరిగిన పాలస్తీనా అనుకూల ప్రదర్శనలో స్వీడన్‌ కార్యకర్త గ్రేటా థన్‌బర్గ్‌ను అరెస్ట్‌ చేశారు. అయితే ఆ తర్వాత ఆమెను కస్టడీ నుంచి పోలీసులు విడుదల చేశారు. ‘నేను పాలస్తీనా యాక్షన్‌ ఖైదీలకు మద్దతు ఇస్తున్నాను. మారణహోమాన్ని వ్యతిరేకిస్తున్నాను’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్న గ్రేటాను ఉగ్రవాద చట్టం కింద అరెస్ట్‌ చేశారని ప్రిజనర్స్‌ ఫర్‌ పాలస్తీనా అనే సంస్థ తెలిపింది. బ్రిటన్‌ ప్రభుత్వం పాలస్తీనా యాక్షన్‌ను ఉగ్రవాద సంస్థగా పరిగణిస్తోంది. ఇది బ్రిటన్‌లో పనిచేస్తున్న పాలస్తీనా అనుకూల ప్రత్యక్ష కార్యాచరణ నెట్‌వర్క్‌. దీనిని 2020లో ఏర్పాటు చేశారు.

గాజాపై ఇజ్రాయిల్‌ జరిపిన యుద్ధ సమయంలో బ్రిటన్‌లో అనేక నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నెట్‌వర్క్‌కు చెందిన 2,489 మందిని వివిధ కారణాలతో పోలీసులు అరెస్ట్‌ చేశారు. గ్రేటా థన్‌బర్గ్‌కు మార్చి వరకూ బెయిల్‌ ఇచ్చామని లండన్‌ నగర పోలీసులు తెలిపారు. నిషేధిత సంస్థకు మద్దతుగా ప్లకార్డు ధరించడంతో ఆమెను అరెస్ట్‌ చేశామని చెప్పారు. పోలీసులు నిర్బంధించిన కార్యకర్తలకు మద్దతుగా ప్రిజనర్స్‌ ఫర్‌ పాలస్తీనా సంస్థ నిరాహార దీక్షలు ప్రారంభించింది. 2018లో స్వీడన్‌ పార్లమెంట్‌ ఎదుట వాతావరణ సంబంధమైన నిరసనలు జరపడంతో 22 సంవత్సరాల గ్రేటా థన్‌బర్గ్‌ వార్తల్లోకి ఎక్కారు. ఆమెను మరో 478 మందితో కలిసి అక్టోబరులో నిర్బంధించిన ఇజ్రాయిల్‌ వారందరినీ దేశం నుంచి బహిష్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -