Wednesday, April 30, 2025
Homeజిల్లాలుషార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాప్ దగ్ధం

షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాప్ దగ్ధం

నవతెలంగాణ – నిజాంసాగర్ 
షార్ట్ సర్క్యూట్ తో కిరాణా షాప్ దగ్ధమైన ఘటన మహ్మద్ నగర్ మండలంలోని గాలిపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు గంజి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం మధ్యాహ్నం సమయంలో ఎలక్ట్రిక్ బోర్డులో ఒక్కసారిగా షర్ట్ సర్క్యూట్ కావడంతో షాప్ మొత్తం మంటలు అలుముకొని కిరాణా షాపులో ఉన్నటువంటి వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. మొత్తం రూ.5,00,000/- నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. కిరాణా షాపు మీదనే ఆధారపడిన బాధితుడు షాప్ కాలిపోవడంతో కన్నీటి పర్యంతమయ్యాడు. మంటలు భారీగా వ్యాపించి దట్టంగా కమ్ముకపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురి అయ్యారు. స్థానికులు నీటిని తీసుకొచ్చి మంటలను ఆర్పడంతో మంటలు వేరే ఇంటికి వ్యాపించకుండా భారీ ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. నష్టపోయిన బాధితుడిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img