- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని కెలుర్ గ్రామంలో డ్వాక్రా మహిళ సంఘం భవనం నిర్మాణానికి మంగళవారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఇందిరకాంతి పథకం కింద రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ భవనానికి మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దారాస్ సాయిలు, స్థానిక సర్పంచ్ లక్ష్మణ్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా దరాస్ సాయిలు మాట్లాడుతూ.. మహిళల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఈ భవనం నిర్మాణం పూర్తయిన తర్వాత డ్వాక్రా మహిళలకు సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఈ అరుణ్, ఇతర అధికారులు, స్థానిక నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
- Advertisement -



