నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని అల్లీపూర్ గ్రామంలో మొదటి వార్డులో నిమ్మకాయల మణెమ్మ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో శుక్రవారం గ్రామ సర్పంచ్ కుంభాల మణెమ్మశేఖర్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు పోశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మన గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్, వార్డు మెంబర్ శానకొండ రాజు, కొత్తకొండ మూర్తి, అక్కి తిరుపతి, గ్రామ యువకులు బోయ తిరుపతి, దొంతి అజయ్, సంగం శ్రీధర్, నిమ్మకాయల పరుశురాములు, స్వామి, పిల్లి అనిల్, కొంక వేణు, ఎగుర్ల అజయ్, చేలిమాల రుచిత్ రెడ్డి, వేణు, ప్రవీణ్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
అల్లీపూర్ లో ఇందిరమ్మ ఇంటికి భూమి పూజ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



