– ఢిల్లీలో అభిషేక్ సింఘ్వీతో చర్చించిన డిప్యూటీ సీఎం, మంత్రుల బృందం
– నేడు బీహార్‌కు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెప్టెంబర్ 30 లోగా స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర సర్కారు సీరియస్‌గా దృష్టి సారించింది. సోమవారం ఢిల్లీలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా చిక్కులు లేకుండా చూసేందుకు న్యాయ సలహాలు తీసుకునేందుకు ఢిల్లీ వచ్చామని తెలిపారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వీలతో భేటీ అయ్యి న్యాయపరమైన అంశాలపై చర్చిస్తామని తెలిపారు. వారి సలహాలు తీసుకుంటామని చెప్పారు. న్యాయనిపుణులతో భేటీ ముగిసిన తర్వాత సీఎం, మంత్రుల బృందం మంగళవారం బీహార్‌కు వెళ్లనున్నది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న ఓటర్ అధికార యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం, మంత్రులు పాల్గొననున్నారు.
42 శాతం రిజర్వేషన్లపై న్యాయకోవిదులతో మంత్రుల బృందం భేటీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES