Saturday, October 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజీఎస్టీ వసూళ్ల వృద్ధిలో అట్టడుగు స్థానం

జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో అట్టడుగు స్థానం

- Advertisement -

ఆర్థిక విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు : కాంగ్రెస్‌ సర్కారుపై ట్వీట్‌లో కేటీఆర్‌ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం అట్టడుగు స్థానంలో ఉందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో ఆర్థిక విధ్వంసానికి ఇవే ఆనవాళ్లు అంటూ ట్వీట్‌ చేశారు. సెప్టెంబర్‌ 2025లో వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్ల వృద్ధి రేటులో దేశంలోనే అట్టడుగున తెలంగాణ ఉండటం దారుణమని తెలిపారు. రెండేండ్ల క్రితం, కేసీఆర్‌ పాలనలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రేవంత్‌ పరిపాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పే ఒక సూచిక ఇదేనని పేర్కొన్నారు.

అలాగే బీఆర్‌ఎస్‌ హయాంలో అన్ని రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన దన్నుతో ఆర్థిక వ్యవస్థ పరుగులు తీసిందని తెలిపారు. వ్యవసాయం నుంచి ఐటీ వరకు అన్ని రంగాలు రికార్డులను తిరగ రాసిందని గుర్తు చేశారు. కానీ ఇవాళ కాంగ్రెస్‌ పాలనలో మాత్రం పండగొచ్చినా, పబ్బమొచ్చినా కూడా అన్ని రంగాలు నేలచూపులే చూస్తున్నాయని విమర్శించారు. వ్యవసాయం నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు అన్ని రంగాల్లో దైన్యమే తాండవిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలసిన రేవంత్‌ పాలనలో తెలంగాణ ఆర్థిక విధ్వంసానికి గురవుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -