Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఆగస్టులో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

ఆగస్టులో పెరిగిన జీఎస్టీ వసూళ్లు

- Advertisement -

– ఏపీలో 21 శాతం వృద్ధి
– తెలంగాణలో 12 శాతం పెరుగుదల


న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది ఆగస్టులో వస్తు సేవల పన్నులు (జీఎస్టీ) వసూళ్లు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 6.5 శాతం పెరిగి రూ.1.86 లక్షల కోట్లుగా నమోదయ్యాయని కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. జులై నెలలో రూ.1.96 లక్షల కోట్ల వసూళ్ళతో పోల్చితే తగ్గాయని పేర్కొంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్టీ చరిత్రలోనే రికార్డ్‌ స్థాయిలో రూ.2.37 లక్షల కోట్ల వసూళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. గడిచిన ఆర్థిక సంవత్సరం 2024-25లో రికార్డ్‌ స్థాయిలో రూ.22.08 లక్షల కోట్ల జీఎస్టీ రెవెన్యూ నమోదయ్యింది. ఐదేండ్ల క్రితం 2020-21లో ఇది రూ.11.37 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఆగస్టు నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జీఎస్టీ వసూళ్లు 21 శాతం పెరిగి రూ.3,989 కోట్లకు చేరింది. 2024 ఇదే నెలలో రూ.3,298 కోట్ల జీఎస్టీ నమోదయ్యింది. గడిచిన నెలలో తెలంగాణలో రూ.5,103 కోట్ల జీఎస్టీ వసూళ్లయ్యింది. గతేడాది ఇదే నెలలో రూ.4,569 కోట్ల జీఎస్టీతో పోల్చితే 12 శాతం పెరుగుదల చోటు చేసుకుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad