- Advertisement -
9 శాతం పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు
న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. 9 శాతం పెరిగి రూ.1.89 లక్షల కోట్లకు చేరాయి. సెప్టెంబర్ 22న అమల్లోకి వచ్చిన రేటు హేతుబద్ధీకరణ రూపంలో జీఎస్టీ 2.0తో ఈ వసూళ్లు పెరిగాయని అధికారులు పేర్కొంటున్నారు. సెప్టెంబర్ 22 నుంచి జీఎస్టీ రేటు తగ్గింపుల కారణంగా ఈ నెలలో డిమాండ్ పెరిగిందని అధికారవర్గాలు తెలిపాయి. అయితే గత ఏడాదిలో స్థూల వస్తువులు, సేవల పన్ను వసూళు(జీఎస్టీ)రూ.1.73 లక్షల కోట్లు.
- Advertisement -