Friday, January 2, 2026
E-PAPER
Homeబీజినెస్డిసెంబర్‌లో రూ.1.74 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

డిసెంబర్‌లో రూ.1.74 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

- Advertisement -

న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లతో కేంద్ర ఖజానా నిండుతోంది. 2025 డిసెంబర్‌లో దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు రూ.1.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2024 ఇదే నెలలోని రూ.1.64 లక్షల కోట్లతో పోల్చితే 6.1 శాతం వృద్ధి చోటుచేసుకుంది. జీఎస్టీ రేట్ల కోత కారణంగా దేశీయ విక్రయాల నుంచి వచ్చే వసూళ్లు కొంత నెమ్మదించినట్లు ఆర్థికశాఖ పేర్కొంది. గడిచిన నెలలో దేశీయ లావాదేవీల్లో 1.2 శాతం పెరిగి రూ.1.22 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. దిగుమతి వస్తువులపై జీఎస్టీ ఏడు శాతం పెరిగి రూ.51,977 కోట్లకు చేరింది. రిఫండ్ల రూపంలో రూ.28,980 కోట్లు తిరిగి చెల్లించినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. దీంతో నికరంగా జీఎస్టీ వసూళ్లు రూ.1.45 లక్షల కోట్లుగా చోటు చేసుకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -