Sunday, December 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్హల్ద గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

హల్ద గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరిక 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండలంలోని హల్ద గ్రామంలో  స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కే రజిత దేవేందర్ ఆదివారం ముధోల్ నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బి నారాయణ్ రావు పటేల్ వారికి శాలవా పూలమాలతో సన్మానం చేశారు. అనంతరం హల్ద గ్రామస్తులు మాజీ సర్పంచ్ దేవేందర్ ఆధ్వర్యంలో దాదాపుగా బీజేపీ, బిఆర్ ఎస్ పార్టీ నుంచి 50మంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండి గ్రామాలను అభివృద్ది చేసేందుకు కృషి చేస్తందని తెలిపారు. అదే విదంగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించి కొన్ని పూర్తి కావడం జరిగింది. మళ్ళీ రెండో విడతలో ముధోల్ నియోజక వర్గంలో నీ కుభీర్ మండలానికి 300 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కావడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుభీర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బషీర్ సీనియర్ నాయకులు బంక బాబు మండల యువ నాయకుడు పురం శెట్టి రవికుమార్ ఉప సర్పంచ్ జీవన్ గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -