అర్థ దశాబ్దం కిందటే అంటరానితనం, కుల నిర్మూలనకి ‘కాలం మారింది’ సినిమా అద్దం పట్టింది. 1972లో విడుదలైన ఈ సినిమా అప్పట్లోనే సంచలనం సృష్టించింది. గాంధీజీ భావాలకు ప్రతీరూపంగా నిలిచిన ఈ చిత్రాన్ని మేకర్స్ ఆయనకు అంకితమివ్వడం విశేషం. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీనియర్ జర్నలిస్ట్, నిర్మాత వాసిరాజు ప్రకాశం నిర్మించిన ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా ఆంధ్రప్రదేశ్ నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది.
ఈ సినిమా విడుదలై 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ వసంతంలోకి అడుగుపెడుతున్నప్పటికీ ఈ సినిమాలో చర్చించిన ప్రతి విషయమూ నేటి సామాజిక వ్యవస్థకు ప్రతిరూపంగా నిలవడం మరో విశేషం. నాయకానాయికలుగా నటించిన శోభన్‌బాబు, శారదల నటన ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఇక కె.విశ్వనాథ్ దర్శకత్వం అందర్నీ ఎంతగానో అలరించింది. అంతేకాదు ఆలోచింపజేసేలా కూడా చేసింది. బొల్లిముంత శివరామకృష్ణ మాటలు, సాలూరి రాజేశ్వరరావు సంగీతం, దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు రాఘవయ్య చౌదరి, దాశరథి కృష్ణమాచార్య, సింగిరెడ్డి నారాయణరెడ్డి చేసిన గీత రచన ఈ సినిమాకి అదనపు ఆకర్షణలుగా నిలిచాయి. మమత ప్రొడక్షన్స్ పతాకంపై వాసిరాజు ప్రకాశం, బి.హనుమంతరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
అర్థ దశాబ్దం క్రితమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



