Tuesday, June 24, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మహిళా సంఘాల సభ్యులకు కరదీపిక ఆవిష్కరణ…

మహిళా సంఘాల సభ్యులకు కరదీపిక ఆవిష్కరణ…

- Advertisement -

నవతెలంగాణ భువనగిరి కలెక్టరేట్ 
మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరస్యతా సమాచార కరదీపిక -శిక్షణ మాడ్యూల్ యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆవిష్కరించారు. జిల్లాలో నూతనంగా ఎన్నుకోబడిన మహిళా సంఘాల సభ్యులు , లీడర్ల శక్తివంతీకరణకు తోడ్పడే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా శిక్షణ మాడ్యూల్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం జిల్లా గ్రామీనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడిన శిక్షణ మాడ్యూల్‌లో మహిళా సంఘాల నిర్వహణ, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక నిర్వహణ, స్వయం సహాయ గ్రూపుల పనితీరు మెరుగుపరచే పాఠ్యాంశాలు పొందుపరచబడ్డాయనారు. 

ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ “మహిళల శక్తివంతీకరణ దేశ అభివృద్ధికి బలం అని అన్నారు. ఈ మాడ్యూల్ మహిళలకు మార్గదర్శిగా నిలుస్తుందన్నారు. గ్రామీణ స్థాయిలో మహిళలు ఆధికారబద్ధంగా వ్యవహరించేలా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో   స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్  వీరారెడ్డి ,  డిఆర్‌డిఓ నాగి రెడ్డి ,   అడిషనల్ డిఆర్.డిఓ  జంగా రెడ్డి డీపీయమ్ లు ఇతర అధికారులు మహిళా సంఘాల ప్రతినిధులు , శిక్షణా బృందం సభ్యులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -