Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్కాలానికి అనుకూలంగా చేనేత డిజైన్లను రూపొందించాలి: కలెక్టర్

కాలానికి అనుకూలంగా చేనేత డిజైన్లను రూపొందించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
మారుతున్న కాలానికి అనుగుణంగా  చేనేత డిజైన్లు రూపొందించాలని  యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు.

గురువారం జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని రాయగిరి క్రాస్ నుండి జిల్లా కలెక్టరు కార్యాలయం వరకు చేనేత కార్మికుల భారీ ర్యాలీని, జిల్లా కలెక్టరు హనుమంత రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థలు అదనపు భాస్కరరావు, ఏడి హ్యాండ్లూమ్ శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన గావించారు. చేనేత కళను కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించారు. 

 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కళాకారులకు నా యొక్క శుభాకాంక్షలు, చేనేత కార్మికులు ఇంద్రియాలను  కూడగట్టుకొని వస్త్రాలను తయారు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఇక్కత్ వస్త్రాలకు కళకు ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిందన్నా రు. ఫ్యాషన్ కు తగ్గట్టుగా వస్త్రాలు తయారు చేస్తే  మార్కెటింగ్ బాగా పెరుగుతుందన్నారు. ప్రపంచ సుందరీమణులు  పోచంపల్లి సందర్శించినప్పుడు, వారు మన వస్త్రాన్ని ధరించడం వల్ల మార్కెట్ పెరిగిందని తెలిపారు.

నేతన్న భీమాకు చనిపోయిన నెలరోజుల్లోనే  రూ.5 లక్షల ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మీ  పిల్లలు  హ్యాండ్లూమ్స్ టెక్నాలజీలో  చదివించాలని ఉద్దేశం ఉంటే  ఆ రంగంలోని చదివించాలన్నారు. నేతన్న కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఉండగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కస్తుందని అన్నారు.మార్కెట్ లో వేటికి మంచి ఆదరణ ఉందో వాటిని చేనేతలు ఉత్పత్తి చేయాలని సూచించారు. మార్కెట్లో వేటికి డిమాండ్ ఉందో వాటి గురించి చేనేత కార్మికులు తెలుసుకోవాలని కోరారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇచ్చేవిధంగా సిద్ధంగా ఉన్నామన్నారు. అనంతరం 

 రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి మాట్లాడుతూ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 1905 లో స్వదేశీ ఉద్యమం చేపట్టడం జరిగిందన్నారు. 2015  ఆగస్టు 7 నుండి జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. చేనేత వస్త్రాలకు భువనగిరి జిల్లా ప్రసిద్ధిగాంచిదని తెలిపారు. 

 స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర రావు మాట్లాడుతూ చేనేత వస్త్రాలకు పెట్టింది పేరు అన్నారు. మన జిల్లా నుండి 50 శాతం  రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. నేషనల్ అవార్డు వచ్చిన వారిని సన్మానం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నేతన్నకు చేయూత, నేతన్న బీమా చెక్కులను అందించారు. 

 యాదాద్రి భువనగిరి జిల్లాలో చేనేత భీమా కింద  6  కోట్ల 75 లక్షలు లబ్ధిదారులకు మంజూరి చేయడం జరిగిందనీ, మరమగ్గాల నేతన్న పొదుపు పథకం కింద  2, 76,86,400, బెనఫిషరీ ఖాతాలో జమ చేయడం జరిగిందనారు . హ్యాండ్లూమ్ నేతన్న పొదుపు పథకం  కింద  2.కోట్ల 17  లక్షల బెనఫిషరీ ఖాతాలో జమ చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చేనేత రంగంలో విశేష కృషి చేసిన నేతన్నలకు సన్మానంచేసి మెమొంటో అందజేశారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని  పాఠశాలల్లోని విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు మెమొంటో అందజేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చేనేత జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టరు శ్రీనివాస్, చేనేత సహకార సంఘ ప్రెసిడెంట్ జల్ది రాములు, కార్మిక సంఘ నాయకులులక్ష్మీ నరసయ్య, చేనేత సహకార సంఘ అధ్యక్షులు సుధాకర్, చేనేత సహకార సంఘం ప్రెసిడెంట్ సుధాకర్ సుదర్శన్, డెవలప్మెంట్ ఆఫీసర్ రాజేశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్  సత్యనారాయణ, చేనేత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img