నవతెలంగాణ-రాయికల్
కొండగట్టు పాదయాత్రకు వెళుతున్న ఖానాపూర్ మండలం సత్తెనపల్లి గ్రామానికి చెందిన హనుమాన్ మాలధారణ స్వాములకు రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. టీఎస్ 21 టీ 3577 నంబర్ గల ఆటో రాయికల్ వైపు వస్తుండగా.. జగిత్యాల వైపు నడుచుకుంటూ వెళ్తున్న స్వాములను ఎదురుగా ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు స్వాములకు మోకాళ్ల వద్ద స్వల్ప గాయాలు అయినట్లుగా తెలిసింది.
సమాచారం అందుకున్న ఎస్‌ఐ సీహెచ్ సుధీర్ రావు,ఏఎస్ఐ దేవేందర్,పోలీస్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని,క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.ఆటో డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.



