Tuesday, September 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంప్రజల కండ్లల్లో ఆనందం

ప్రజల కండ్లల్లో ఆనందం

- Advertisement -

– మీనాక్షి నటరాజన్‌
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి

రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక న్యాయం కోసం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో మున్ముందుకు సాగు తున్నామని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నట రాజన్‌ అన్నారు. సోమవారం వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గంలోని ఇల్లంద నుంచి ప్రారంభ మైన జనహిత పాదయాత్ర వర్ధన్న పేట పట్టణంలోని అంబేద్కర్‌ జంక్షన్‌ వరకు సాగింది. పాదయాత్ర అనంత రం జరిగిన బహిరంగ సభలో మీనాక్షి నటరాజన్‌ మాట్లాడారు. మీ భాష తనకు తెలీదని, అయినా ప్రజల కండ్ల ల్లో ఆనందం కనిపిస్తుందని వ్యాఖ్యా నించారు.టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ముంబయిలో ఒకే ఇంట్లో 49 ఓట్లు, కరీంనగర్‌ లోనూ ఒకే ఇంట్లో 40 ఓట్లున్నాయని తెలి పారు. బీజేపీ గెలిచిన తీరుపై సందే హాలున్నాయని, ఒకే పౌరుడికి రెండు ఓట్లు ఉండొచ్చా అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ బీజేపీకి వత్తాసు పలుకుతుందని అన్నారు.పాదయాత్ర లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, ప్రభుత్వ విప్‌ రామచందర్‌ నాయక్‌, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -