Thursday, January 1, 2026
E-PAPER
Homeఎడిట్ పేజికొత్త సంవత్సర స్వాగతం

కొత్త సంవత్సర స్వాగతం

- Advertisement -

ఎన్నో మిఠాయి పొట్లాలను ఎదలపై
వదిలేసి వయ్యారంగా వెళ్లిపోతుంది
ఎన్నో కన్నీళ్లను చెక్కిల్లపై జారవిడిచి
గుండెకు లోతైన గాయాలను చేసి
క్యాలెండర్‌ మార్చుకుని కాలగర్భంలో
కలిసిపోతుంది 2025 సంవత్సరం

పోతూపోతూ కొన్ని జీవిత పాఠాలను
గుండెకు గురువులా నేర్పింది
మరికొన్నింటిని అందంగా
అలవాటు చేసింది
మరి కొన్నింటికి కామా పెట్టాలి
మరి కొన్నింటికి పుల్‌స్టాఫ్‌ చుట్టాలి

కొత్త సంవత్సరానికి స్వాగతం అంటే
చాటింగ్లు, గ్రీటింగ్‌లు, కేక్‌ కట్టింగ్‌లు కాదు
సుక్క, ముక్కతోటి చిందులేసుడు
అంతకన్నా కాదు
భవిత కోసం బెర్తును
భద్రంగా మలుచుకోవాలి
కులం కంపును, మతం మత్తును వదిలేసి
కడుపులోని కల్మషాలను కడిగేసుకుని
మల్లెపువ్వులా
మానవతా పరిమాళాలను వెదజల్లుతూ
విశ్వ మానవుడిగా వికసించాలి
– తాటిపాముల రమేశ్‌ (తార)
7981566031

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -