Monday, June 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం శుభాకాంక్షలు

ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం శుభాకాంక్షలు

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
ప్రతి సంవత్సరం జూన్ 23 న ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి ప్రజా సేవా దినోత్సవాన్ని జరుపుకుంటామని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి తెలిపారు. సోమవారం ఐక్య రాజ్యసమితి ప్రజాసేవ దినోత్సవం సందర్బంగా నాగార్జున సాగర్ నియోజకవర్గం ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి ప్రక్రియలో ప్రజా సేవ యొక్క సహకారాన్ని ఎత్తిచూపడం మరియు సమాజానికి ప్రజా సేవకు విలువ ఇవ్వడం. సమాజంలో అభివృద్ధి మరియు మెరుగుదలలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్రను గుర్తించడానికి అనేక కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలిపారు.20 డిసెంబర్ 2002 న, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 57/277 తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా ఐక్యరాజ్యసమితి 23 జూన్ ను ప్రజా సేవా దినోత్సవంగా భావించడం జరిగిందని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -