నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఆదేశాల మేరకుగత కొద్దిసంవత్సరాల నుండి హర్ గార్ తిరంగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ ప్రజల ఐక్యత తెలుపుతూ దేశ ప్రజలలో దేశ భక్తి నింపాలనది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పి వైస్ చైర్మన్ పోతంగల్ కిషన్ రావు , ఎస్టి మోర్చా రాష్ట్ర నాయకులు మోజీరామ్ నాయక్ , మండల ఉపాధ్యక్షులు మాణిక్ రావు, సీనియర్ నాయకులు బాల అర్జున్ గౌడ్ ప్రధాన కార్యదర్శి రాంసింగ్ భాస్కర్ రావు ,గోవర్ధన్ ,సంజీవులు సాయిలు, శ్యామ్ ,సుభాష్ తదితరులు పాల్గొన్నారు.
మండల కేంద్రంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES