Sunday, February 15, 2026
E-PAPER
Homeఆటలుపాక్ మాజీ పేసర్ పై నిప్పులు హర్భజన్ సింగ్ ఆగ్రహం

పాక్ మాజీ పేసర్ పై నిప్పులు హర్భజన్ సింగ్ ఆగ్రహం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ లో ఈరోజు భారత్ – పాకిస్థాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. కొలంబోలో జరగనున్న ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మరోవైపు ఇరు జట్ల మాజీలు కూడా మాటల యుద్ధం మొదలు పెట్టారు. పాక్ మాజీ పేసర్ మహ్మద్ ఆమిర్ అభిషేక్ శర్మను “స్లాగర్” అంటూ విమర్శించాడు. అభిషేక్ సాంకేతికంగా అంత గొప్ప బ్యాటర్ కాదని, సరైన ప్రణాళికలు ఉంటే అతడిని సులభంగా ఔట్ చేయవచ్చని ఆమిర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలు భారత శిబిరంలో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి.

దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందిస్తూ ఆమిర్ పై నిప్పులు చెరిగారు. “ఆమిర్ ఇప్పుడే నిద్ర నుంచి లేచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు” అంటూ విరుచుకుపడ్డారు. అభిషేక్‌ను స్లాగర్ అనడం తప్పని, అతడు పరిపూర్ణ బ్యాటర్ అని హర్భజన్ ప్రశంసించారు. “అభిషేక్ కు ఏ షాటైనా కొట్టగల సామర్థ్యం ఉంది. బంతి ఎలా వస్తుందో, ఎలా ఆడాలో తెలిసిన ఆటగాడు. ఓవర్ కవర్, లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్, మిడ్ వికెట్… ఏదైనా అతని వద్ద అన్ని షాట్లు ఉన్నాయి. ప్రపంచ వేదికపై తనను తాను నిరూపించుకున్నాడు” అని హర్భజన్ అన్నారు. అభిషేక్ కొలంబోలో మ్యాచ్ ఆడితే పాకిస్థాన్ విజయాన్ని దూరం చేస్తాడని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -