టిహెచ్అర్ సేన, బిఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు దాసరి రవి
నవతెలంగాణ – పరకాల
మాజీ మంత్రి హరీశ్‌రావుపై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు నిరిదారమణి టిహెచ్అర్ సేన,బిఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర నాయకులు దాసరి రవి అన్నారు. బిఆర్ఎస్ ఎదుగుదల కోసం కెసిఆర్ సరి సమానంగా కృషి చేసిన హరీష్ రావు పై కవిత ఆవాకులు చావాకులు పేలడం సరికాదన్నారు. రవి మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నాడు ఉద్యమంలో, పాలనలో, నేడు ప్రతిపక్షంలోనూ హరీశ్‌రావు అనునిత్యం కేసీఆర్‌కు వెన్నంటి ఉంటున్నారని తెలిపారు.
బీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ పటిష్టత కోసం హరీశ్‌రావు ఎంతో కృషి చేశారన్నారు. అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల కోసం ముందుండి పోరాటం చేసిన హరీశ్‌రావుపై కవిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. కన్న తండ్రిని కన్నతల్లిలాంటి పార్టీకి ద్రోహంచేయాలని చూస్తే సహించేదిలేదన్నారు. ఆనాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరు ఒక సోదరిలాగానే భావించామని తెలిపారు. ఇప్పటికైనా కవిత పునరాలోచించుకోవాలని సూచించారు. పార్టీ ని విచ్చిన్నం చేయాలనిచూస్తే మాత్రం అందుకు బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు చూస్తూ ఊరుకోరని అందుకు ధీటుగా సమాధానం చెప్తామన్నారు. పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు హరీశ్‌రావుకు అండగా ఉంటామని చెప్పారు.