Wednesday, March 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం 

ఆరోగ్యం పట్ల అవగాహన అవసరం 

- Advertisement -

నవతెలంగాణ – బల్మూరు : చదువుతున్న యువకులు ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే చుట్టుపక్కల వారికి ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించే అవకాశం ఉంటుందని అచ్చంపేట అదనాపు డిఎంహెచ్వో తార సింగ్ అన్నారు. బుధవారం ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోడలాగుల విద్యార్థులు  ఎన్ఎస్ఎస్ ఆరవ రోజు కార్యక్రమంలో భాగంగా మండలంలోని తోడేళ్లగడ్డ సీతారాంపూర్ గ్రామాలలో ఎన్ఎస్ఎస్ విద్యార్థులు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు.

  ఈ సమావేశం కళాశాల ప్రిన్సిపాల్  రవి పరంగి గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో వైద్యులు విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత, సమతుల్య పోషకాహారం, రక్తహీనత నివారణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలు, మానసిక ఆరోగ్య పరిరక్షణ వంటి ముఖ్య అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత ముందుండాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గడ్డం శ్రీలత రమేష్ , స్కూల్ హెడ్‌మాస్టర్ విష్ణు ,గ్రామ కార్యదర్శి యాదమ్మ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ల జాన్ బాబు గారు,  వెంకటయ్య  అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -