Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్తపల్లిలో ఆరోగ్య శిబిరం – వడదెబ్బ నివారణపై అవగాహన 

కొత్తపల్లిలో ఆరోగ్య శిబిరం – వడదెబ్బ నివారణపై అవగాహన 

- Advertisement -

నవతెలంగాణ–కాటారం
కాటారం మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో బుధవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వేసవికాలం సమీపిస్తున్న నేపథ్యంలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గ్రామ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఓఆర్‌ఎస్ (ORS) ద్రావణం వినియోగం, డ్రైడే పాటించడం, పరిసరాల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలపై వివరించారు. గ్రామంలో పర్యటించి శానిటేషన్ పరిస్థితులను పరిశీలించారు. గర్భిణీ స్త్రీల (ANC) గృహాలను కూడా సందర్శించి ఆరోగ్య సలహాలు అందించారు.

వేసవిలో బయట పనులకు వెళ్లేవారు తప్పనిసరిగా శుభ్రమైన తాగునీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. చలువ కళ్లద్దాలు ధరించడం, తలకు టోపీ పెట్టుకోవడం, కాటన్ వస్త్రాలు ఉపయోగించడం అవసరమని చెప్పారు. వడదెబ్బ తాకినప్పుడు శుభ్రమైన నీటిలో ఓఆర్‌ఎస్ ద్రావణం కలిపి నెమ్మదిగా తాగాలని సూచించారు. అలాగే కొబ్బరి బోండాలు లేదా ఒక చిటికెడు ఉప్పు, ఒక చెంచాడు చక్కెరను శుభ్రమైన నీటిలో కలిపి తాగితే డీహైడ్రేషన్ నివారించవచ్చని తెలిపారు.

వడదెబ్బ తాకినప్పుడు వాంతులు, విరోచనాలు, చెమటలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయని, అలాంటి పరిస్థితుల్లో వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. వీలైతే ఉదయం, సాయంత్రం సమయాల్లోనే పనులు చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎంఎల్‌హెచ్‌పి డాక్టర్ గీత, జిల్లా ఎపిడెమిక్ టీం సభ్యుడు కాపర్తి రాజు, గ్రామ సర్పంచ్ అరుణ, గ్రామ కార్యదర్శి జోష్న, హెల్త్ అసిస్టెంట్ సమ్మయ్య, మహిళా హెల్త్ అసిస్టెంట్ టి. నాగరాణి, ఆశా కార్యకర్తలు అరుణ, పార్వతి, సరిత, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -