Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి 

గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలి 

- Advertisement -

సీహెచ్ఓ కుసుమ విద్యాసాగర్ 
నవతెలంగాణ – పెద్దవంగర
: వర్షాకాలం నేపథ్యంలో గ్రామాల్లో క్రమం తప్పకుండా వైద్య సిబ్బంది హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సీహెచ్ఓ కుసుమ విద్యాసాగర్, డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వనాకర్ రెడ్డి అన్నారు. అవుతాపురం పల్లె దావఖాన ను శనివారం వారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులు, రిపోర్టులను పరిశీలించి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. వ్యాధుల నివారణకు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రత పాటించేలా ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఎన్సీడీ, ఆబా కార్డులను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఎన్ఎం జ్యోత్స్న, ఆశ కార్యకర్తలు సామ్రాజ్యం, సరిత పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -