అర్చక ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ
నవతెలంగాణ – పాలకుర్తి
దేవాదాయ శాఖలో, ఆలయాల్లో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగులకు ఆరోగ్య భీమా సౌకర్యాన్ని కల్పించి అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అర్చక, ఉద్యోగుల రాష్ట్ర జేఏసీ కన్వీనర్ డివిఆర్ శర్మ ప్రభుత్వాన్ని కోరారు. బుధవారం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసి అర్చక, ఉద్యోగుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివిఆర్ శర్మ మాట్లాడుతూ అర్చక ఉద్యోగుల జేఏసీ పోరాట ఫలితమే రాష్ట్రంలో గల ప్రజా ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టిందని తెలిపారు. కారుణ్యం నియామకాలు చేపట్టడంతో అర్చక, ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. రాష్ట్రంలో ఆలయాలకు అనుసంధానంగా ఉన్న భూములను కాపాడాలని మంత్రిని కోరామని తెలిపారు.
అర్చక, ఉద్యోగులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. అర్చక, ఉద్యోగుల అభ్యర్థనను ప్రభుత్వం స్పందించి పరిష్కార దిశగా కృషి చేయడం అభినందనీయమన్నారు. అర్చక ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని మంత్రి కొండా సురేఖ అన్నారు. అర్చక, ఉద్యోగులు, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసే దేవాలయాల అభివృద్ధికి తోడ్పాటు అందించాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అర్చక, ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
అర్చక ఉద్యోగులకు ఆరోగ్య బీమాను అమలు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES