Wednesday, October 8, 2025
E-PAPER
Homeతాజా వార్తలుహైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ

హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై మధ్యాహ్నం 12:30 గంటలకు విచారణ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్ల విచారణను హైకోర్టు మధ్యాహ్నం 12:30 గంటలకు వాయిదా వేసింది. ఈ అంశంపై దాఖలైన అన్ని పిటిషన్లను విచారణ చేపడతామని తెలిపింది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టులో విచారణ తర్వాత ఎలాంటి తీర్పు వస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -