Tuesday, March 24, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జుక్కల్ లో భారీ వడగండ్ల వాన

జుక్కల్ లో భారీ వడగండ్ల వాన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం నాడు సాయంకాలం వడగళ్ల వాన భారీగా కురిసింది. ఈ వడగండ్ల వాన భారీ వర్షం గా మారడంతో రబి పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన లో ఉన్నారు. ఈ వడగండ్ల వానతో మండలంలోని జొన్న , మొక్కజొన్న , పుచ్చకాయ , కూరగాయలు , మామిడి పండ్ల తోటలో పూత , కాత , పిందెలు,  కాయలు రాలిపోవడం,  పలు పంటలపై అపార నష్టం వాటిల్లుతుంది. గత మూడు రోజుల క్రితం కురిసిన వర్షానికి ప్రొద్దుతిరుగుడు , జొన్న , గోధుమల, మామిడి పండ్ల తోటలో నష్టం, ఇవే కక ఇతర పంటలు భూమిపై అడ్డం పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. పంట నష్టం విలువ అంచనా వేసే వరకు ఏమి తెలియదని రైతులు వాపోయారు. అకాల వర్షానికి నష్టాలు జరుగుతున్న రైతులను ఆదుకోవాలని రైతులు పేర్కొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -