Tuesday, July 22, 2025
E-PAPER
Homeజిల్లాలునేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

నేడు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీచేసింది. ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, మెదక్‌, కామారెడ్డి, నాగర్‌కర్నూల్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇక బుధవారం.. మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30-40 కిలో మీటర్ల ఈదురుగాలులతో వర్షాలు అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉన్నదని పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -