– అమెరికా టెక్ కంపెనీలపై ఇరాన్ గురి
– ఐఆర్‌జీసీ నిర్ణయం మేరకు విధ్వంసం
టెహ్రాన్: అమెరికా మిత్ర దేశాలకు ఇరాన్ గట్టి షాక్ ఇస్తోంది. పాలస్తీనాను దెబ్బతీయటానికి ఇజ్రాయిల్ ఐటీ కంపెనీలతో విధ్వంసక రచన చేసింది. ఇప్పుడు ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయిల్ కనుసన్నల్లో ఉన్న కీలక స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సైనిక చర్యల కోసం ఈ సంస్థల టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున వీటిని లక్ష్యంగా చేసుకున్నట్టు ఐఆర్‌జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నిం న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ”ఈ ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం మౌలిక సదుపాయాలకు విస్తరిస్తున్న కొద్దీ.. ఇరాన్ లక్ష్యాల పరిధి కూడా పెరుగుతోంది” అని తాజా కథనం పేర్కొంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్‌విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి టెక్ సంస్థలతోపాటు ఇజ్రాయిల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్టు తెలిపింది. అమెరికా, ఇజ్రాయిల్‌లకు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలనూ లక్ష్యంగా చేసుకుంటామని.. ఇందుకోసం శత్రువులు తమకు స్వేచ్ఛ కల్పించారని పేర్కొంది.నేపథ్యంలో ఆయా ప్రదేశాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరించింది.
ఎత్తుకు పైఎత్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



