బాధిత కుటుంబానికి చేయూత

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి గ్రామానికి చెందిన మంతెన దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా తెలంగాణ ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీపాద ట్రస్ట్ చైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు ఆదేశాల మేరకు ఎడ్లపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగిడి సమ్మయ్య, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ జంగిడి శ్రీనివాస్ బాధిత కుటుంబానికి 50 కిలోల సన్నబియ్యం అందజేసి చేయుతనిచ్చారు. అదైర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ ఉపాధ్యక్షుడు లక్ష్మీ రాజo, అజ్మీర శివ,లావుడియా ప్రశాంత్, లావుడియా రవీందర్,అక్కినవేన మాంతయ్య,తోకరి శంకర్, పంత కానీ బాపు, మంతెన సంపత్, గుర్రం సారయ్య, మంతని రాజకుమార్, లావుడియా సారయ్య, సిరాజ్,మంతెన సారయ్య పాల్గొన్నారు.
Spread the love