Sunday, March 8, 2026
E-PAPER
Homeసోపతి'ఆమె' ప్రతిఘటన అనివార్యం..!

‘ఆమె’ ప్రతిఘటన అనివార్యం..!

- Advertisement -

ఆమె బ్రతుకును
ఆమెను బ్రతకనివ్వని ధాష్టీకం
ఆమె క్రతువును
ఆమెను చేయనీయని దుష్టత్వం
అమాంతం ఆమెను మ్రింగుతున్న
ఒకానొక దుర్భర దృశ్యం
కలలన్నీ కల్లలై
కళలన్నీ వెల వెలబోయి
దిష్టిబొమ్మవుతున్న జీవన చిత్రం
రెక్కల్ని విరిచేసి కాళ్లను కట్టేసి
మూతుల్ని కుట్టేసి ముఖాలకు ముసుగేసి
నినదించ మంటున్న నియంత పోకడ
అంతా అశాంతి లోకం అంతా ఆగని శోకం
చాప కింద నీరులా ఏదో పెత్తనం
తరతరాలుగా నరనరాల్లో
గూడుకట్టుకున్న అసమాన క్రీడ
అజ్ఞానం వేయి పడగలెత్తి విషం చిమ్ముతోంది
విలువల వలువలూడదీస్తూ..
ఆమెను దిగంబరంగా నిలబెడుతున్న దుస్థితే
స్వతంత్ర దేశంలో ఎక్కడో ఒక్కాడ ”ఆమె”
మనిషిగా మరణించిన సన్నివేశమే
సమాజం కళ్లప్పగించి చూస్తున్న వికత నీడ
ఇది వీథి నాటకం కాదు ఓ విధ్వంస జాడ
ప్రతిస్పందించని అరాచక శిలాక్షరాల గోడ
ఈ చీకటి కోణాల్ని చీల్చేదెన్నడు!?
ప్రశ్నలన్నీ అస్పశ్యమౌతున్నాయి
ప్రశ్నలన్నీ అస్పష్టమౌతున్నాయి
బానిసత్వం ఏడుతరాలై ఏడుస్తుంది
ఆకాశంలో సగం పొగడ్తలతోట ఉత్తమాట
కొన్ని సంక్షోభాలు కొన్ని సంక్లిష్టాలు
కొన్ని వ్యధలు కొన్ని వ్యతలు
ఎవరు అవునన్నా కాదన్న
అన్నీ సామూహిక దు:ఖ రుతువులు
పితస్వామ్యం నుంచి కొనసాగే క్రతువులు
కలైనా నిజమైనా వసంతం కోసమే ఆరాటం
మనిషిని మనిషిగా పూర్ణించటానికే పోరాటం
ఓ మహిళా ఇప్పుడు నీ ప్రతిఘటన అనివార్యం..!
డా.కటుకోఝ్వల రమేష్‌, 9949083327

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -