నవ్వులం.. పువ్వులం..

గూడు చెదిరిన గువ్వలం
చాటు-మాటు పువ్వులం

బాలలం మేము బాలలం
భావి భారత విలువలం

అనాధ బతుకుల జీవులం
మెతుకులకై వెతుకులాటల జీవులం

అమ్మ నాన్న లక్రోధము- ఉన్మాదము
పెరిగి పెరకక నిలిచినం

అమ్మ నాన్నలు విసిరి వేసిన
విరాజాజి పువ్వులం
పరమళించే నవ్వులం

మాలో ఉన్నది పరిమళం
పసిగట్టి పెంచితే పంచుతం అమతం

మొలకలెత్తిన మొలకలం
నీరు మడిచినారులం
వీదినబడ్డ భావి భారత పౌరులం

చిన్నారులం -పొన్నారులం
వీధి బడి ఎరుగని సుకుమారులం

సమాజ సంఘపు వారదులం
సద్వినియోగపు నిర్మల సహౄదయులం

చేయూతనివ్వండి- చేరదీయండి
ఓ అమ్మానాన్న-కనిపారేయకండి కాలు మొకుతం
– తిరుమలాపురం రాజేష్‌, 9177909700

Spread the love