మనం ఎదిగిపోయాం

మనం ఎదిగిపోయాం
నిజమే మనం చాలా ఎదిగిపోయాం ….
చిన్నప్పుడు
చింత చెట్టుకింద ఆడుకునే మనం
నేడు ఆన్‌లైన్‌లో ఆటలు ఆడుకుంటున్నం
చిన్నప్పుడు ఒక్క క్షణం
అమ్మ కనిపించకపోతే ఎడిచిన మనం
నేడు జీవితాంతం వాళ్ళకు దూరంగా
విదేశాల్లో బ్రతుకుతున్నం
సంతోషాన్ని, దుఖాన్ని
బంధువులతో పంచుకున్న మనం
నేడు చరవాణిలో
స్టేటస్‌లు రైలు భోగిలా పెంచుతున్నాం
నిజమే మనం చాలా ఎదిగిపోయాం……..

పండుగలతో కళ కళ లాడే పల్లె సీమ
నేడు పట్టణాలకు పయనమైన
తమ పిల్లల రాకకోసం పరుగులు తీస్తుంది
జ్ఞానం నేర్పిన బడి పంతులు ఎదురుపడితే
నేడు యే రా అనే స్థాయికి ఎదిగిపోయాం
నిజమే మనం చాలా ఎదిగిపోయాం…….

ఆడపిల్ల పుడితే
పసి గొంతుల్ని చిదిమెస్తున్న మనం
అదే ఆడ పిల్ల కడుపులో
పురుడు పోసుకున్నం అనే సంగతే మరిచాం
పేదరికంతో
చిరిగిన దుస్తువులను వేసుకున్న మనం
నేడు చిరిగిన దుస్తులతో
ఫ్యాషన్‌ అనే మైకంలో మునిగిపోయాం
నిజమే మనం చాలా ఎదిగిపోయాం….

కన్నతల్లిని, కట్టుకున్న ఆలిని వదిలేసి
బ్రతుకంతా ధారపోసిన
భారతమ్మ ముద్దుబిడ్డలని వదిలేసి
నేడు సిల్వర్‌ స్క్రీన్‌లో కనిపిస్తున్న
రీల్‌ హీరోలను రియల్‌ హీరోలుగా భావించి
కూటికి గతిలేని తిప్పలను వదిలేసి
కురిమిలో గొప్పల కోసం
రీల్‌ హీరోలు ఎదగటానికి కారణమవుతూ
మన బతుకులను దిగజార్చుకుంటున్నం
నిజమే మనం చాలా ఎదిగిపోయాం….
– యమ్‌.మమత

Spread the love