నేను ఎందుకో
నాతో ”నేను” మాట్లాడుతుంటే
నచ్చడం లేదు….
మనసులో పొర్లే
”మాట”కు అర్థం నచ్చలేదు…
ఓడిపోతున్న
”నిజం”గొంతుక నచ్చలేదు
ఒరిగిపోతున్న
”నిజాయితీ” బలహీనత నచ్చలేదు
ఊపిరాడని
”ఊహ”ల మౌనం నచ్చలేదు
అలివికాని
”ఆలోచనలిల లోతు నచ్చలేదు
పిచ్చిగా
”పంచుకునే” ప్రేమ నచ్చలేదు
మనసును భయపెట్టే
”దూరం” నచ్చలేదు
మాటకు విలువలేని
”దగ్గర” నచ్చలేదు..
జవాబు దొరకని
”ప్రశ్న”లా బతుకు నచ్చలేదు
కలలు కన్న కోరికలే
”శత్రువు”లుగా మారడం నచ్చలేదు
చివరిగా
నీలో నీవు చూపిన
”నేను” అసలు నచ్చడం లేదు.
– చందలూరి నారాయణరావు
9704437247